సహాయం:దిద్దుబాటు రికవరీ
వికీమీడియా ఫౌండేషను వారి కమ్యూనిటీ టెక్ టీమ్ అభివృద్ధి పరచిన దిద్దుబాటు రికవరీ అంశం, మీడియావికీ కోర్‌లో భాగం. పురోగతిలో ఉన్న దిద్దుబాట్లను భద్రపరచే, బ్రౌజరు ఆధారితమైన వ్యవస్థ ఇది. బ్రౌజరు అకస్మాత్తుగా, అనుకోకుండా మూసుకుపోతే అప్పటివరకూ జరిగిన దిద్దుబాటును ఈ వ్యవస్థ ద్వారా తిరిగి తెచ్చే వీలు ఉంటుంది. దిద్దుబాటు డేటా స్థానికంగా, వాడుకరి కంప్యూటరు లోనే దాచబడి ఉంటుంది. ఈ అంశం వికీటెక్స్ట్ ఎడిటరు కోసం మాత్రమే, VisualEditor కోసం కాదు. దీని కోసం WikiEditor ను చేతనం చెయ్యాల్సిన అవసరం లేదు.
MediaWiki version: | ≥ 1.42 |
దిద్దుబాటు రికవరీ, Indexed Database API ను వాడుకుంటుంది కాబట్టి, ఈ జాబితా ప్రస్తుతం వాడుతున్న డివైసుకు, బ్రౌజరుకూ సంబంధించి మాత్రమే ఉంటుంది. మీ దిద్దుబాటును వేరే డివైసులో రకవరీ చెయ్యలేరు.
ఈ అంశాన్ని వికీమీడియా ప్రాజెక్టు లన్నిటి లోనూ స్థాపించాం. 2024 మే నాటికి, దీనిపై వాడుకరుల అభిప్రాయాలు కోరాం. ఏవైనా సమస్యలు ఎదురైతే నివేదించేందుకు, ప్రాజెక్టు చర్చ పేజీకి వాడుకరులను స్వాగతిస్తున్నాం. 2023 కమ్యూనిటీ విష్‌లిస్టు సర్వేలో ఇది #8 వ కోరిక.
వాడుక
ఒకసారి దీన్ని చేతనం చేసుకున్నాక, దిద్దుబాటు రికవరీని వాడుకోవడానికి ఇక చెయ్యాల్సింది ఏమీ లేదు. ఏదో ఒక వికీ పేజీలో దిద్దుబాటు చెయ్యడం మొదలుపెట్టాక, ప్రతి 5 సెకండ్లకూ ఒకసారి దిద్దుబాటు ఫారాన్ని, బ్రౌజరు నిల్వలో భద్రపరుస్తూ ఉంటుంది. ఒకవేళ విండో మూసుకుపోతే (అనుకోకుండానో, లేదా కంప్యూటర్ ఆగిపోవడమో మొదలైన వాటి వలన) దాన్ని తిరిగి తెరిచాక, అదే పేజీని మళ్ళీ దిద్దుబాటు కోసం తెరవండి. బ్రౌజరు నిల్వలో ఏదైనా రికవరీ డేటా ఉంటే, దాన్ని ఎడిటింగ్ ఫారంలోకి తిరిగి తెచ్చి, ఒక గమనింపును చూపిస్తుంది.
గమనింపులో రెండు వికల్పాలుంటాయి: మార్పులను చూడడం (మామూలు, "మార్పులను చూపించు" బొత్తాంను నొక్కడం లాంటిదే ఇది), లేదా వాటిని తిరస్కరించడం. ఆ గమనింపును మూసేసేందుకు, మామూలుగానే దానిపై ఎక్కడ నొక్కినా చాలు.
ఆ పేజీని ఇక దిద్దుబాటు చెయ్యవద్దనీ, రికవరు చేసిన డేటాను సేవు చెయ్యవద్దనీ మీరు అనుకుంటే, "రద్దుచేయి" లింకును ("తేడాలను చూపించు" బొత్తాం పక్కన ఉన్నది) వాడాలి. "రద్దుచేయి" ను నొక్కీ నొక్కగానే దిద్దుబాటు రికవరీ డేటా అంతా పోతుంది. దిద్దుబాటు ఫారం నుండి మిమ్మల్ని బయటికి తీసుకుపోతుంది. మీ ఎడిటింగ్ సెషన్ను రద్దుచేయక పోయినా లేదా భద్రపరచక పోయినా, 30 రోజుల తర్వాత రికవరీ డేటా ఆటోమాటిగ్గా అంతమైపోతుంది.
Special:EditRecovery
ప్రస్తుతం దిద్దుబాటు జరుగుతున్న పేజీలకు సంబంధించి ఏదైనా రికవరీ డేటా ఉంటే ఆ పేజీల జాబితాను Special:EditRecovery అనే ప్రత్యేక పేజీలో చూడవచ్చు. ఈ జాబితా నుండి మీరు నేరుగా పేజీలో దిద్దుబాటు చెయ్యడానికి గానీ, పేజీని చూడడానికి గానీ వెళ్ళవచ్చు. లేదా ఆ పేజీకి సంబంధించిన రికవరీ డేటాను తొలగించవచ్చు (అది ఇక అక్కరలేదని మీరు భావిస్తే)
వద్దనుకుంటే
అంశాన్ని చేతనం/అచేతనం చేసుకునేందుకు ఈ అభిరుచిని తగువిధంగా మార్పుకోవచ్చు.
ఇవి కూడా చూడండి
- Manual:Edit Recovery — వికీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు, డెవలపర్లకు ఈ అంశం గురించిన సమాచారం కోసం.